మోడీ ఫాసిస్టా?.. ఏఐ చెప్పిన సమాధానంతో కేంద్రం సీరియస్

by Swamyn |
మోడీ ఫాసిస్టా?.. ఏఐ చెప్పిన సమాధానంతో కేంద్రం సీరియస్
X

దిశ, నేషనల్ బ్యూరో: సెర్చ్ ఇంజిన్ గూగుల్ తీసుకొచ్చిన అడ్వాన్స్‌డ్ ఏఐ టూల్ ‘జెమిని’.. ప్రధాని మోడీ గురించి అడిగిన ఓ ప్రశ్నకు వివాదాస్పద సమాధానం ఇచ్చింది. ‘ప్రధాని మోడీ ఫాసిస్టా?’ అని ఓ నెటిజన్‌ అడగ్గా.. ‘‘కొందరు నిపుణులు ఫాసిస్టుగా అభివర్ణించే విధానాలను అమలుచేస్తున్నారని మోడీపై ఆరోపణలు వచ్చాయి’’ అని సమాధానమిచ్చింది. ఇదే ప్రశ్నను అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గురించి అడిగితే మాత్రం.. ‘అంత కచ్చితంగా చెప్పలేం’ అంటూ జవాబిచ్చింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఇది కేంద్రం దృష్టికి వెళ్లగా, ప్రభుత్వం సీరియస్ అయింది. ‘‘ఇది ఐటీ చట్టం నిబంధనల ప్రత్యక్ష ఉల్లంఘన కిందకు వస్తుంది. క్రిమినల్‌ కోడ్‌ నిబంధనలను కూడా ఉల్లంఘించినట్లే’’ అని కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ హెచ్చరించారు. దీనిపై నెటిజన్లు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. జెమిని నిజమే చెప్పిందని కొందరు అంటుంటే, మరికొందరేమో దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏఐ టూల్ భారత్‌పై పక్షపాత ధోరణిని ప్రదర్శిస్తోందని విమర్శిస్తున్నారు.


Advertisement

Next Story