- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
GATE-2025 Shedule: గేట్-2025 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్ష పూర్తి షెడ్యూల్ వెల్లడి..!
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని ఐఐటీ(IIT)లు, ఇతర ప్రముఖ విద్యా సంస్థల్లో ఎంటెక్(M.Tech), పీహెచ్‌డీ(PHD) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE-2025) నోటిఫికేషన్ ఇదివరకే విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఈ పరీక్షకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ గత నెలలోనే ముగిసింది. ఇదిలా ఉంటే ఈ పరీక్షకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఐఐటీ రూర్కీ(IIT Roorkee) శుభవార్త చెప్పింది. టెస్ట్ పేపర్ల వారీగా గేట్-2025 పరీక్ష షెడ్యూల్(Exam Schedule)ను ప్రకటించింది. గేట్ ఎగ్జామ్స్(GATE Exams)ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో నిర్వహించనున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్ష జరగనుంది. ఉదయం 9.30 నుంచి 12.30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌లను జనవరి 2 నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మార్చి 19న ఫలితాలను విడుదల చేస్తారు. అభ్యర్థులు పూర్తి షెడ్యూల్ కోసం www.gate2025.iitr.ac.in అనే వెబ్‌సైట్ ను సందర్శించిగలరు. కాగా గేట్ స్కోర్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి.