Frozen Snake in IceCream : ఐస్క్రీంలో పాము.. షాక్ అవుతున్న నెటిజన్స్

by M.Rajitha |
Frozen Snake in IceCream : ఐస్క్రీంలో పాము.. షాక్ అవుతున్న నెటిజన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా మనం ఐస్క్రీం కొంటే దాన్లో డ్రైఫ్రూట్ ముక్కలు, టూటీ ఫ్రూటీలు వస్తూ ఉంటాయి. కానీ థాయిలాండ్‌(Thailand)లోని ఓ వ్యక్తి ఐస్క్రీం బార్ కొనగా.. దానిలో కనిపించిన దానిని చూసి షాక్ అయ్యాడు. ఆ ఐస్క్రీం బార్(IceCreame Bar) లో ఏకంగా గడ్డకట్టిన పాము(Frozen Snake in IceCream) కనిపించడంతో దెబ్బకు కంగుతిన్నాడు. అయితే భయపడి దానిని పడేయకుండా ఫోటో తీసి ఫేస్‌బుక్‌(Face Book)లో అప్‌లోడ్ చేశాడు. తాను ఐస్క్రీం బ్లాక్ బీన్ కొన్నాను అని తమాషాగా కామెంట్ కూడా చేశాడు. దీంతో ఆ ఫోటో సామాజిక మాధ్యమా(Social Media)ల్లో విపరీతంగా వైరల్ అయింది.

వేలమంది దానిని షేర్ చేశారు. కాగా ఆ ఐస్క్రీం బార్ లో నలుపు పసుపు రంగుతో పాము, దాని తల స్పష్టంగా కనిపిస్తోంది. అయితే పాము ఉన్న ఐస్క్రీంను కొంతమంది నెటిజన్స్ వామ్మో అని భయపడితే మరికొంతమంది మాత్రం సెటైర్లు వేశారు. ఈ ఐస్క్రీంను ఎండలో ఉంచితే అది కరిగిపోయి పాము బయటకు వస్తుందా అని ఒకరంటే, మంచి ప్రోటీన్ ఆహారం దొరికింది అని మరో నెటిజన్ అన్నారు.

Next Story

Most Viewed