- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాష్ట్రాభివృద్ధి కోసమే షిండే ప్రభుత్వంలో చేరాం.. ఎన్సీపీ మాజీ నేత అజిత్ పవార్
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రాభివృద్ధి కోసమే షిండే -ఫడ్నవిస్ ప్రభుత్వంలో చేరామని ఎన్సీపీ మాజీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అన్నారు. తాను తీసుకున్న నిర్ణయం కొంతమందికి నచ్చకపోవచ్చని,కానీ అలాంటి వాళ్లను పట్టించుకోనని అన్నారు. తాను తీసుకున్న నిర్ణయంతో తమ ఎమ్మెల్యేలు సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ లతో కలిసి రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకుంటామని అన్నారు. కాగా గత కొంతకాలంగా అజిత్ పవార్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పై గుర్రుగా ఉన్నారు.
పార్టీలో తనకు కాకుండా కూతురు సుప్రియకు శరద్ పవార్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, ఈ క్రమంలోనే అజిత్ పవార్ 30 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబావుటా ఎగురవేశారు. అందులో తొమ్మిదిమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అజిత్ పవార్ తిరుగుబాటుతో ఎన్సీపీ ఒక్కసారిగా షాక్ కు గురైంది.