Jharkhand: రెండు రోజుల్లో బీజేపీతో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్: చంపై సోరెన్

by Harish |   ( Updated:2024-08-27 15:20:46.0  )
Jharkhand: రెండు రోజుల్లో బీజేపీతో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్: చంపై సోరెన్
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ ఆగస్టు 30న చిన్న కుమారుడు బాబులాల్ సోరెన్‌తో కలిసి బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మంగళవారం ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాపై నాకు పూర్తి నమ్మకం ఉంది, మరో రెండు రోజుల్లో బీజేపీతో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాను, కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. జార్ఖండ్‌లో గిరిజనుల ఉనికిని నేను రక్షించగలననే విశ్వాసం నాకు ఉందని అన్నారు.

ఈ సందర్భంగా జేఎంఎం పార్టీకి రాజీనామా చేయడంపై మాట్లాడుతూ, తన రక్తాన్ని, చెమటను అందించాను, కానీ పార్టీలో తనకు గౌరవం దక్కలేదన్నారు. రాజకీయ జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. బలవంతంగా నాయకత్వ మార్పును చేశారు. నేను మౌనంగా ఉండిపోయాను, కానీ నా గుండె నొప్పిగా ఉంది. జార్ఖండ్ సమస్యతోనే నేను బీజేపీలోకి చేరాను. బీజేపీ మా కొత్త మిత్రపక్షం అని అన్నారు. అంతకుముందు చంపై తన చిన్న కుమారుడు బాబులాల్ సోరెన్ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మతో కలిసి అమిత్ షాను సోమవారం అర్ధరాత్రి న్యూఢిల్లీలో కలిశారు.

మరోవైపు కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ చంపై సోరెన్‌లో చేరడాన్ని స్వాగతించారు. హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేయడంతో చంపై సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే హేమంత్ జైలు నుంచి విడుదలయ్యాక బలవంతంగా చంపై సోరెన్ ‌చేత రాజీనామా చేయించారు. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోరెన్ బీజేపీలో చేరుతుండటం వలన పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Next Story

Most Viewed