వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై జేపీసీ ఏర్పాటు.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-09 11:36:28.0  )
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై జేపీసీ ఏర్పాటు.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
X

దిశ, వెబ్‌డెస్క్: వక్ఫ్ బోర్డు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై జేపీసీ ఏర్పాటు చేసింది. 21 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంట్‌లో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ జేపీసీలో తెలంగాణ నుంచి ఎమ్ఐఎమ్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ ఎంపీ డీకే అరుణకు అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదదేశ్ నుంచి లావు కృష్ణదేవయరాయలు, విజయసాయి రెడ్డికి చోటు కల్పించారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్ట సవరణకు లోక్‌సభలో కొత్త బిల్లును ప్రవేశపెట్టడం ప్రస్తుతం.. అధికార విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు.. ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు 2024ను లోక్‌సభలో గత గురువారం ప్రవేశపెట్టారు. అయితే దీనిపై కాంగ్రెస్, సమాజ్ వాదీ, తృణముల్ కాంగ్రెస్, వామపక్షాలు, ఎంఐఎం సహా ముస్లిం పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ క్రమంలోనే ఈ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ - జేపీసీ ఏర్పాటు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story