- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వరుసగా మూడోరోజు.. బీబీసీలో కొనసాగుతున్న ఐటీ సోదాలు

దిశ, డైనమిక్ బ్యూరో : బీబీసీ కార్యాలయాల్లో ఐటీ అధికారుల సర్వే కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబైలోని బీబీసీ ఆఫీసుల్లో వరుసగా గురువారం మూడోరోజు అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. మంగళవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన సోదాలు 45 గంటలు గడిచినా కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు. అయితే, ఈ సోదాలు మరికొంత కాలంపాటు కొనసాగుతాయని బుధవారం అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే.
కాగా, సోదాలు ప్రారంభమైనప్పటి నుంచి ఢిల్లీలోని బీబీసీ ఆఫీసులో కనీసం 10 మంది సీనియర్ ఉద్యోగులు ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, ఐటీ అధికారులు బీబీసీ సిబ్బంది నుండి ఆర్థిక లావాదేవీలు, పలు డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఢిల్లీలోని బీబీసీ ఆఫీసులో ఎప్పటిలాగే వార్తలు ప్రసారం చేస్తున్నారని, చాలా మంది ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారని అధికారులు చెప్పారు.