- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐదుగురు జవాన్ల మరణానికి కారణం ఉగ్రవాదులే: ఆర్మీ
దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంలో మంటలు చెలరేగి ఐదుగురు జవాన్లు మరణించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది టెర్రరిస్టుల దాడే అని ఆర్మీ అధికారులు తేల్చి చెప్పారు. జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కుపై ఉగ్రవాదులు గ్రనేడ్లు విసిరి దాడి చేసినట్లు గుర్తించారు. భారీ వర్షాన్ని అవకాశంగా మలుచుకొని దాడి చేసినట్లు అనుమానిస్తు్న్నారు. వర్షం కారణంగా ఉగ్రవాదుల కదిలికలను బలగాలు పసిగట్టకపోవడం మూలంగా.. ఇదే అదునుగా భావించిన ఉగ్ర మూకలు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయని ఆర్మీ అధికారులు చెప్పుకొచ్చారు. ముందు వాహనంపై పిడుగు పడిందని భావించిన ఆర్మీ.. ట్రక్కను పరిశీలించిన అనంతరం ఉగ్రదాడిగా నిర్ధారించారు. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. ట్రక్కు పూర్తిగా కాలిబూడిదైంది. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం ఆర్మీ అధికారులు వేట కొనసాగిస్తున్నారు. పరిస్థితిని భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఆర్మీ అధికారులు వివరించారు.