- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫుడ్ ప్యాకెట్‌లో ఉమ్మి వేసిన ఉద్యోగిపై ఎఫ్‌ఐఆర్ నమోదు
దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఒక రెస్టారెంట్‌లో ఒక వ్యక్తి ఆహార ప్యాకెట్లలో ఉమ్మి వేసిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. లోని ప్రాంతంలో ఉన్న ఓ ఫుడ్ అవుట్‌లెట్‌లో ఈ ఘటన నమోదైంది. వీడియోలో ఇద్దరు వ్యక్తులు, తినుబండారంలోని ఉద్యోగులు, ఆహారాన్ని ప్యాక్ చేస్తున్నారు. హిందూ వాహిని ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. వీడియోలో నిలబడి ఉన్న వ్యక్తి ఆహారాన్ని ప్యాక్ చేస్తున్నప్పుడు అందులో ఉమ్మి వేశాడు. వీడియో వైరల్ కావడంతో అధికారికంగా ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదుదారులు చేసిన ఆరోపణ ప్రకారం.. ఈ హోటల్ ఒక నిర్దిష్ట మత వర్గానికి చెందినది, అదేవిధంగా ఉద్యోగి మరొక మతానికి చెందిన వ్యక్తులకు ఉద్దేశించిన ఆహారాన్ని తారుమారు చేశారని ఫిర్యాదలో ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీడియోలో కనిపిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఘటనపై ప్రస్తుతం విచారణ ఇంకా కొనసాగుతోంది.