ఢిల్లీ లిక్కర్ స్కామ్: సిసోడియాకు జ్యూడీషియల్ కస్టడీ పొడిగింపు

by Satheesh |
ఢిల్లీ లిక్కర్ స్కామ్: సిసోడియాకు జ్యూడీషియల్ కస్టడీ పొడిగింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 17వ తేదీ వరకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. లిక్కర్ స్కాం కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో మనీష్ సిసోడియాకు జ్యుడిషీయల్ కస్టడీని పొడిగించాలని కోరారు. దీంతో మనీష్ సిసోడియాకు జ్యుడిషియల్ కస్టడీని కోర్టు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా, గతవారం సిసోడియా బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. కానీ, ఈ కేసును సీబీఐ విచారిస్తున్న నేపథ్యంలో సిసోడియా పిటిషన్‌‌ను కోర్టు కొట్టివేసింది.

Advertisement

Next Story

Most Viewed