నాగాలాండ్‌లో ‘అఫ్సా’ చట్టం పొడిగింపు: కేంద్రం కీలక నిర్ణయం

by Dishanational2 |
నాగాలాండ్‌లో ‘అఫ్సా’ చట్టం పొడిగింపు: కేంద్రం కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: నాగాలాండ్‌లోని 8 జిల్లాలు, ఐదు జిల్లాల పరిధిలోని 20 పోలీస్ స్టేషన్ల పరిధిలో కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(అఫ్సా)ను పొడిగించింది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఇది అమలులో ఉండనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దిమాపూర్, నియులాండ్, చుమౌకెడిమా, మోన్, కిఫిరే, నోక్లక్, ఫేక్, పెరెన్ జిల్లాల్లో అఫ్సాను పొడిగించినట్టు తెలిపింది. శాంతి భద్రతల పరిస్థితుల దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం అఫ్సా చట్టాన్ని నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌లలో 2023 సెప్టెంబర్‌లోనూ పొడిగించింది. కశ్మీర్‌లో అఫ్సాను రద్దు చేయడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని అమిత్ షా చెప్పిన మరుసటి రోజే ఈ ప్రకటన రావడం గమనార్హం.

అఫ్సా అంటే ఏమిటి?

సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(అఫ్సా) శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రాంతాల్లో సాయుద బలగాలకు ప్రత్యేక అధికారాలను ఇస్తుంది. 1958 సెప్టెంబరు 11న దీనిని భారత ప్రభుత్వం ఆమోదించింది. దీనిని మొదట అసోంలోని నాగా హిల్స్‌కు మాత్రమే వర్తింప జేయగా.. ఆతర్వాత దేశమంతా విస్తరించారు. ఒక ప్రదేశంలో ఘర్షణలు తలెత్తినప్పుడు అరెస్టు చేయడానికి, కాల్పులు జరపడానికి ఈ చట్టం అనుమతిస్తుంది. సాయుధ బలగాల కార్యకలాపాలను సులభతరం చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.


Next Story