- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Exclusive: జ్ఞానవాపి మసీదులో హన్‌మాన్, వినాయకుడు.. సంచలనాత్మక ఫొటోలు మీకోసం..
దిశ, నేషనల్ బ్యూరో: వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదుపై భారత పురావస్తుశాఖ విభాగం(ఏఎస్ఐ) జరిపిన సర్వే నివేదిక దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ మసీదు సముదాయం ప్రదేశంలో గతంలో పెద్ద హిందూ దేవాలయ నిర్మాణం ఉండేదని నివేదికలో ప్రస్తావించారని హిందువుల పక్షం తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వెల్లడించిన విషయం తెలిసిందే. జ్ఞానవాపి మసీదు కంటే పెద్ద హిందూ దేవాలయం ఆ స్థలంలో ఉండేదని ఏఎస్‌ఐ సర్వేలో గుర్తించారని పేర్కొన్నారు. తాజాగా, ఆ మసీదులో ఏఎస్ఐ తీసిన ఫొటోలను జాతీయ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ సంపాదించింది. ఆ ఫొటోల్లో హనుమాన్, వినాయకుడు వంటి హిందూ దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయి.
హిందూ దేవాలయం ఆనవాళ్లు కనిపించకుండా జ్ఞానవాపి మసీదులో ఎన్నో మార్పులు చేశారని, ఆలయం నుంచి తీసుకొని వాడుకున్న స్తంభాలపై ఉన్న చిత్రాలను తొలగించడానికి ప్రయత్నాలు జరిగిన ఆనవాళ్లు కూడా సర్వేలో లభ్యమయ్యాయని న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వివరించారు. అలాగే, దేవనాగరి, తెలుగు, కన్నడ, ఇతర లిపులలో రాసిన 34 పురాతన హిందూ దేవాలయ శాసనాలు కూడా లభ్యమయ్యాయని పేర్కొన్నారు. శాసనాలలో జనార్ధన, రుద్ర, ఉమేశ్వర అనే ముగ్గురు దేవతల పేర్లు ఉన్నాయని తెలిపారు. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) టెక్నాలజీతో ఏఎస్ఐ సర్వే చేసి ఈ నివేదికను విడుదల చేసిందన్నారు. కాగా, అప్పటికే ఉన్న ఆలయ నిర్మాణంపై జ్ఞానవాపి మసీదును 17వ శతాబ్దంలో నిర్మించారంటూ హిందూ పిటిషనర్లు వేసిన పిటిషన్ ఆధారంగా శాస్త్రీయ సర్వే నిర్వహణకు గత సంవత్సరం కోర్టు ఆదేశించింది. దీంతో మసీదు సముదాయంలో గతేడాది ఏఎస్ఐ సర్వే నిర్వహించింది. ఈ సర్వే నివేదికను హిందూ, ముస్లిం పక్షాలకు ఇవ్వాలని వారణాసి కోర్టు తీర్పు ఇచ్చిన ఒక రోజు తర్వాత ఈ మేరకు సంచలన విషయాలు వెల్లడయ్యాయి.