యువకుడిని కొట్టించి.. విషం తాగించిన మాజీ ప్రియురాలు.. కారణం ఏంటంటే?

by Jakkula Mamatha |   ( Updated:2025-03-15 15:02:02.0  )
యువకుడిని కొట్టించి.. విషం తాగించిన మాజీ ప్రియురాలు.. కారణం ఏంటంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఉత్తర‌ప్రదేశ్‌(Uttar Pradesh)లోని హరీమ్‌పూర్‌(Harimpoor)లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. గత నాలుగేళ్లుగా ప్రేమించుకున్న ఓ జంట.. ఆ తరువాత పరిస్థితుల దృష్ట్యా విడిపోయారు. ఈక్రమంలో వారిద్దరు లవ్‌లో ఉన్నప్పుడు ఇచ్చిన నగలు, డబ్బు తిరిగివ్వాలని మాజీ ప్రియురాలిని యువకుడు డిమాండ్ చేశాడు. దీంతో ఆ యువతి కోపంతో మాజీ ప్రియుడిపై రెచ్చిపోయింది.

అసలు విషయంలోకి వెళితే.. హరీమ్‌పూర్‌‌కు చెందిన ఓ యువకుడు మహోబాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో మెడికల్ రెప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం అతనికి కాళీ పహాడీ గ్రామానికి చెందిన ఓ యువతి పరిచయమైంది. ఆ పరిచయం చివరకు ప్రేమ(Love)గా మారి ఇద్దరు సహజీవనం ప్రారంభించారు. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు.

ఈ క్రమంలో తాను గతంలో ఇచ్చిన నగలను తిరిగివ్వమని అడిగినందుకు అతడి మాజీ ప్రియురాలు తన స్నేహితులతో కొట్టించి, బలవంతంగా విషం తాగించింది. గతంలో తామిద్దరం నాలుగేళ్లు సహజీవనం చేశామని, అప్పుడు ఆమెకు ఖరీదైన నగలు, రూ.4 లక్షల నగదు ఇచ్చానని ఆ యువకుడు చెప్పారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Read Also.. Ranya Rao: డీఆర్ఐ అధికారులపై నటి రన్యారావు సంచలన ఆరోపణలు

Next Story

Most Viewed