- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
JK Opposition parties : ఆగమేఘాలపై అధికారుల బదిలీలు.. ఈసీ సమీక్షించాలి : కశ్మీర్ రాజకీయ పార్టీలు
దిశ, నేషనల్ బ్యూరో : కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసిన తరుణంలో రాజకీయ పార్టీలు తమ వాణిని వినిపించాయి. పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని పీడీపీ నాయకురాలు ఇల్తిజా ముఫ్తీ కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి కొన్ని గంటల ముందే కశ్మీర్‌లో దాదాపు 200 మంది అధికారుల బదిలీలు జరిగాయని ఆమె పేర్కొన్నారు. కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ పూర్తిగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోందని చెప్పారు. ఈ ఎన్నికల్లో పీడీపీ చీఫ్ మహబూబా ముఫ్తీ పోటీ చేస్తారా అని ఇల్తిజా ముఫ్తీని మీడియా ప్రశ్నించగా.. ‘‘ఈ ప్రశ్నను నేరుగా మహబూబాతోనే అడగండి. ఇప్పటికైతే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమె అనుకోవడం లేదు’’ అని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో కశ్మీర్ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయని కశ్మీర్‌కు చెందిన సీపీఎం నేత మహ్మద్ యూసుఫ్ తరిగామి పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధం అయినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ఈసీకి డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ ఛైర్మన్ గులాం నబీ ఆజాద్ ధన్యవాదాలు తెలిపారు. దీనిపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా స్పందిస్తూ.. ‘‘మేం కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను కోరుకుంటున్నాం. ఈవిషయంపై ఇచ్చిన మాటను కేంద్రం నిలుపుకోవాలి’’ అని కోరారు. ‘‘ఎన్నికలకు మేం రెడీ. అయితే అవి పారదర్శకంగా జరగాలి. కశ్మీర్‌లో గత కొన్ని గంటల్లో ఆగమేఘాలపై జరిగిన అధికారుల బదిలీలపై ఈసీ సమీక్షించాలి’’ అని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు.
జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ చీఫ్‌గా తారిఖ్ హమీద్ కర్రా
జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ చీఫ్‌గా తారిఖ్ హమీద్ కర్రా నియమితులయ్యారు. తారా చంద్, రమన్ భల్లాలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌లుగా నియమితులు అయ్యారు. ఇప్పటివరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) శాశ్వత ఆహ్వానితుడిగా తారిఖ్ హమీద్ కర్రా వ్యవహరించేవారు. తాజాగా ఆయనకు జమ్మూకశ్మీర్ సారథ్య బాధ్యతలు అప్పగించినందున.. సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడిగా వికార్ రసూల్ వానిని నియమించారు.