Eknath Shinde: మహాయుతి కూటమి బంపర్ విక్టరీ.. సీఎం పదవిపై ఏక్‌నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు

by Shiva |
Eknath Shinde: మహాయుతి కూటమి బంపర్ విక్టరీ.. సీఎం పదవిపై ఏక్‌నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) నేతృత్వంతోని మహాయుతి కూటమి (Mahayuti Alliance) అఖండ విజయం దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 227పైగా స్థానాల్లో ఆ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర (Maharashtra)కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై చర్చ కోనసాగుతోంది. తాజాగా ఎన్నికల ఫలితాలపై సీఎం ఏక్‌నాథ్ షిండే (CM Eknath Shinde) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఊహించినట్లుగానే మహాయుతి (Mahayuti)కి బంపర్ వెజారిటీ వచ్చిందని అన్నారు.

తమకు ఓటేసిన మహిళలు, రైతులు, సహా అన్ని వర్గాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా సీఎం పదవిపై కూడా ఆయన కామెంట్ చేశారు. పూర్తి ఫలితాలు వచ్చాక ముఖ్యమంత్రి (Cheif Minister) ఎవరనే దానిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అదేవిధంగా ఎక్కువ సీట్లే వచ్చిన వాళ్లే సీఎం (CM) కావాలని లేదన్నారు. సీట్లకు, ముఖ్యమంత్రి పదవికి సంబంధం లేదని తెలిపారు. ఈనెల 25న మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష సమావేశం (Maharashtra BJP Legislative Party Meeting) నిర్వహిస్తామని.. అదే రోజు సీఎం అభ్యర్థి ఎంపిక ఉంటుందని అన్నారు. ఈ నెల 26న మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని ఏక్‌నాథ్ షిండే తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed