- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ సమన్లు: మార్చి 4న విచారణకు రావాలని ఆదేశాలు

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. మార్చి 4వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు పంపడం ఇది ఎనిమిదో సారి. అంతకుముందు ఏడు నోటీసులకు కేజ్రీవాల్ తిరస్కరించారు. ఏడో సమన్లలో భాగంగా సోమవారం ఆయన ఇన్వెస్టిగేషన్‌కు హాజరుకావాల్సి ఉండగా..ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున విచారణకు రావడం లేదని తేల్చి చెప్పారు. కోర్టు నిర్ణయం కోసం వేచి ఉండాలని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఈడీ మరోసారి సమన్లు పంపడం గమనార్హం. గతంలో కేజ్రీవాల్‌కు గతేడాది నవంబర్ 2, డిసెంబర్ 22 , ఈ ఏడాది జనవరి 3, 18, ఫిబ్రవరి 2,19 తేదీల్లో ఈడీ సమన్లు పంపగా కేజ్రీవాల్ అన్నింటినీ తిరస్కరించారు. కేవలం తనను అరెస్టు చేసే ఉద్దేశంతోనే ఈడీ సమన్లు పంపిందని ఆరోపించారు. దీంతో ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మార్చి 16న విచారణ జరగనుండగా కేజ్రీవాల్ కోర్టులో హాజరుకానున్నారు.