ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏకు ఈడీ సమన్లు

by Mahesh |
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏకు ఈడీ సమన్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాం రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో సీబీఐ, ఈడీ దూకుడు పెంచారు. ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు జారీ చేయగా.. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏకు ఈడీ సమన్లు జారీ చేసింది. లిక్కర్ స్కాంలో అర్వింద్ కేజ్రీవాల్ పీఏకు విజయ్ నాయర్‌తో కలిసి కీలక పాత్ర పోషించినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో రేపు ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. కానీ, ఢిల్లీ బడ్జెట్ రూపకల్పనలో తలమునకలై ఉన్నానని..విచారణను ఫిబ్రవరి నెలాఖరుకు వాయిదా వేసుకోవాలని సీబీఐకి సిసోడియా విజ్ఞప్తి చేశారు. దీంతో, ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కావాలని సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed