- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో భారీ ట్విస్ట్.. ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీనామా!
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 2015 నుంచి ఈడీకి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్న రాణా.. మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, అతని కుటుంబం, టీఎంసీ నాయకుడు అభిషేక్ బెనర్జీ, రాబర్ట్ లతో సహా అనేక మందికి సంబంధించిన కేసులలో ఫెడరల్ ఏజెన్సీ తరపున ప్రాతినిధ్యం వహించారు. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ లపై జమ్మూ కాశ్మీర్ టెర్రర్ ఫైండింగ్ కేసు, హఫీజ్ సయీద్, సయ్యద్ సలావుద్దీన్ వంటి ఉగ్రవాదులపై కేసుల వంటి విషయాలలోను రాణా ఏజెన్సీకి ప్రాతినిధ్యం వహించారు.
ఎయిర్ ఇండియా స్కామ్, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, భూషణ్ పవర్ అండ్ స్టీల్, రాన్ బాక్సీ రెలిగేర్ మోసం, స్టెర్లింగ్ బయోటెక్ స్కాం, పశ్చిమ బెంగాల్ పశువులపై మనీలాండరింగ్ కేసులు వంటి హై ప్రొఫైల్ కేసుల్లోనూ రాణా ఏజెన్సీకి ప్రాతినిధ్యం వహించి, గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ “ లీగల్ పవర్ లిస్ట్ ఆఫ్ 2020” లోనూ రాణాకి చోటు దక్కింది.