విదేశీ నౌకపై డ్రోన్ దాడి: రక్షించిన ఐఎన్ఎస్ విశాఖపట్నం

by samatah |
విదేశీ నౌకపై డ్రోన్ దాడి: రక్షించిన ఐఎన్ఎస్ విశాఖపట్నం
X

దిశ, నేషనల్ బ్యూరో: గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో మార్షల్ ఐలాండ్‌కు చెందిన ఎంవీ జెన్‌కో పికార్డీ అనే వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. దీంతో ఆ సమయంలో అక్కడే ఉన్న భారత నౌకాదళానికి చెందిన గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ విశాఖపట్నంకు ఫోన్ కాల్ రావడంతో వెంటనే రంగంలోకి దిగి బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు నౌకను అడ్డగించి సహాయం అందించింది. ఎంవీ జెన్‌కో షిప్‌లో 9 మంది భారత నావికులు సహా 22 మంది సిబ్బంది ఉన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇండియన్ నేవీ తెలిపింది. నౌకను అడ్డగించిన తర్వాత షిప్‌లో దెబ్బతిన్న ప్రాంతాన్ని నిపుణులు ఓడలోకి వెళ్లి పరిశీలించారు. తదుపరి రవాణాకు ఆ ప్రాంతాన్ని సురక్షితంగా మార్చారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ఎర్ర సముద్రంలో వ్యాపార నౌకలపై హౌతీ మిలిటెంట్లు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed