- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీని ద్వేషించకండి: ఆప్ కార్యకర్తలకు కేజ్రీవాల్ సందేశం
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ లేఖ విడుదల చేశారు. ఆ సందేశాన్ని కేజ్రీవాల్ భార్య సునీత శనివారం చదివి వినిపించారు. ‘ప్రియమైన దేశ ప్రజలారా..నేను ఎక్కడున్నా దేశ సేవ చేస్తూనే ఉంటా. నా జీవితమంతా దేశానికే అంకితం చేశా. ఇప్పటివరకు లైఫ్‌లో ఎంతో కష్టపడ్డా.. అందుకే అరెస్టు నన్ను ఆర్చర్యపర్చలేదు. పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’ అని కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు. ‘భారత్‌లోని అనేక శక్తులు దేశాన్ని బలహీనపరుస్తున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఢిల్లీలోని మహిళలకు ఇచ్చిన రూ.1000 హామీని నిలబెట్టుకుంటా’ అని తెలిపారు. అలాగే ‘సామాజిక శ్రేయస్సు, ప్రజా సంక్షేమం కోసం పని చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను జైలుకు వెళ్లడంతోనే ఆగిపోకూడదు. నన్ను జైలులో పెట్టనందుకు బీజేపీని ద్వేషించద్దు. ఎందుకంటే వారు కూడా మన సోదరులు, సోదరీమణులు. త్వరలోనే తిరిగి వస్తా’ అని తెలిపారు. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ఈడీ గురువారం అరెస్ట్ చేసింది. అయితే కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా, ఆయన జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని ఆప్ చెబుతోంది.