విపక్షాలపై కోపం వద్దు.. జాలిచూపండి!: బీజేపీ శ్రేణులతో పీఎం మోడీ

by Javid Pasha |
విపక్షాలపై కోపం వద్దు.. జాలిచూపండి!: బీజేపీ శ్రేణులతో పీఎం మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: విపక్షాలపై కోపం వద్దని.. వారిపై జాలి చూపాలని పీఎం మోడీ సెటైర్లు వేశారు. మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన "మేరా బూత్ సబ్సే మజ్‌బూత్" అనే కార్యక్రమంలో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి పీఎం మోడీ మాట్లాడుతూ.. విపక్షాలపై విమర్శలు గుప్పించారు. పాట్నాలో జరిగిన విపక్షాల మీటింగ్ ఓ ఫోటో షో అప్ అని, 2014, 2019 ఎన్నికల్లో కంటే వారిలో ప్రస్తుతం అంతకు మించిన నైరాశ్యం కనిపిస్తోందని అన్నారు. వాళ్ల కామన్ మినిమమ్ ప్రోగ్రాం అవినీతి అని, వాళ్ల కళ్ల ముందు జైళ్లు కనిపిస్తున్నాయని అన్నారు.

అందుకే వాళ్లంతా ఏకమవుతున్నారని విపక్షాలపై సెటైర్లు వేశారు. 2024లోనూ కేంద్రంలో బీజీపీ అధికారంలోకి వస్తుందనే నిరాశతో వాళ్లంతా ఉన్నారని, వాళ్లకు వేరే ఆప్షన్ లేదు కనుకే ఏకమవుతున్నారని అన్నారు. 2జీ, కామన్ వెల్త్ వంటి అనేక స్కామ్ లతో కాంగ్రెస్ లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిందని అన్నారు.

Advertisement

Next Story