ప్రకటనల్లో గడియారం గుర్తును వాడొద్దు: అజిత్ పవార్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు

by samatah |
ప్రకటనల్లో గడియారం గుర్తును వాడొద్దు: అజిత్ పవార్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)లోని తన వర్గానికి చెందిన కార్యకర్తలు ప్రకటనల్లో గడియారం గుర్తును ఉపయోగించడం మానుకోవాలని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. గుర్తు కేటాయింపునకు సంబంధించిన అంశం ప్రస్తుతం పెండింగ్‌లో ఉందని తెలిపింది. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి వార్త ప్రతికల్లో యాడ్స్ ఇవ్వాలని అజిత్‌కు తెలిపింది. న్యాయమూర్తులు సూర్యకాంత్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం 24 గంటల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని అజిత్‌ను కోరిన నేపథ్యంలోనే ఈ ఆదేశాలు రావడం గమనార్హం. కాగా, నేషనల్ కాంగ్రెస్ పార్టీ చీలిపోయిన తర్వాత భారత ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గాన్ని నిజమైన ఎన్సీపీగా గుర్తించి పార్టీ గుర్తు గడియారంను కేటాయించింది. ఈ నిర్ణయాన్ని శరద్ పవార్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా ప్రస్తుతం ఆ అంశం ఇంకా పెండింగ్‌లో ఉంది. అయితే అజిత్ పవార్ తమ పార్టీ కరపత్రాల్లో గడియారం గుర్తును ఉపయోగించి ప్రకటనలు ఇచ్చారు. దీంతో గడియారం గుర్తును ప్రస్తుతం ఉపయోగించొద్దని అత్యున్నత న్యాయస్థానం ఆర్డర్స్ జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed