Raksha Bandhan : రాఖీ పండుగ వేళ.. అదనంగా స్టాండ్‌బై రైళ్లు

by Hajipasha |
Raksha Bandhan : రాఖీ పండుగ వేళ.. అదనంగా స్టాండ్‌బై రైళ్లు
X

దిశ, నేషనల్ బ్యూరో : సోమవారం రోజు రక్షాబంధన్ సందర్భంగా దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడనున్నాయి. ఈసందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఢిల్లీ మెట్రో పలు ముందుజాగ్రత్త ఏర్పాాట్లు చేసింది. రద్దీ ఎక్కువగా ఉండే అవకాశమున్న ఏరియాల్లో కొన్ని స్టాండ్ ‌బై రైళ్లను రెడీ ఉంచనున్నారు. సోమవారం రోజు రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలోకి వాటిని అప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తామని ఢిల్లీ మెట్రో వెల్లడించింది.

టికెట్ కౌంటర్ల వద్ద ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు అదనపు సిబ్బందిని కూడా రాఖీ పండుగ రోజు అందుబాటులో ఉంచుతామని తెలిపింది. వీలైతే యూపీఐ యాప్‌ల ద్వారా మెట్రో ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవాలని ప్రయాణికులకు ఢిల్లీ మెట్రో సూచించింది.

Advertisement

Next Story

Most Viewed