కర్నాటక రిజల్ట్: సీఎం పోస్ట్‌పై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:13 May 2023 10:14 AM  )
కర్నాటక రిజల్ట్: సీఎం పోస్ట్‌పై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు మొదలుపెట్టారు. ఇక కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తల కృషికి ఫలితం దక్కిందని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇక, సీఎం పోస్ట్ గురించి డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మద్దతుదారులంతా కర్నాటకకు మీరే నెక్ట్స్ సీఎం కావాలని కోరుకుంటున్నారనగా.. నాకంటూ ప్రత్యేకంగా మద్దతుదారులెవరూ లేరని.. మొత్తం కాంగ్రెస్ పార్టీ నాకు సపోర్ట్‌గా నిలిచిందన్నారు. సీఎం పదవి ఎవరికి ఇవ్వాలనే విషయం కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందని ఆయన తేల్చి చెప్పారు. ఈ విజయం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరిది అని ఆయన పేర్కొన్నారు. ఇక, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ అధిక్యం దిశగా దూసుకుపోతుంది.

Also Read... కన్నీటి పర్యంతమైన డీకే శివకుమార్

కర్ణాటక రిజల్ట్స్ : ముందంజలో కాంగ్రెస్.. ఇక ఫోకస్ అంతా సీఎం క్యాండిడేట్‌పైనే..!


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story