ఆ ఆలయం క్యూ లైన్లలో.. ‘ఏసీ టన్నెల్’

by Hajipasha |
ఆ ఆలయం క్యూ లైన్లలో.. ‘ఏసీ టన్నెల్’
X

దిశ, నేషనల్ బ్యూరో : ఒడిశాలోని మహిమాన్విత పూరీ జగన్నాథ ఆలయానికి నిత్యం ఎంతో రద్దీ ఉంటుంది. ఈ రద్దీని కంట్రోల్ చేయడానికి ఇప్పటికే ప్రత్యేక క్యూ లైన్లు ఉన్నాయి. అయితే ఈ లైన్లలో బారులుతీరే భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఒక కొత్త వసతిని ఒడిశా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఆలయ ప్రాంగణంలో టన్నెల్‌ను తలపించే ఎయిర్ కండిషన్డ్ (ఏసీ) కారిడార్‌ను ఏర్పాటు చేసింది. న్యూ ఇయర్ 2024 సందర్భంగా జనవరి మొదటివారంలో భక్తుల రద్దీ పెరగొచ్చని ఆలయ అధికారులు అంచనా వేశారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలి వస్తే క్యూ లైన్లలో వేచి ఉండే సమయం మరింత పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో క్యూలైన్లలో నిలబడే భక్తుల సౌకర్యార్ధం.. క్యూ లైన్ మార్గంలో ప్రతి 24 మీటర్ల దూరంలో ఒక ఏసీ టన్నెల్‌‌ను నిర్మించారు. అది పూర్తిగా ఎయిర్ కండీషన్డ్‌‌గా ఉంటుంది. ఏసీ టన్నెల్‌లోనే తాగునీటి వసతి, తాత్కాలిక విశ్రాంతి స్థలాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులోని బారికేడ్ వద్ద మొదటి లైన్‌ను వికలాంగులకు.. తదుపరి లై‌న్‌ను సీనియర్ సిటిజన్‌లకు రిజర్వ్ చేశారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక కారిడార్‌లో ఐదు వరుసల స్టీల్ బారికేడ్‌లను కూడా ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed