- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాజాలో జరిగిన విధ్వంసం ఆందోళనకరం: భారత విదేశాంగ మంత్రి జైశంకర్
దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో భాగంగా గాజాలో జరిగిన విధ్వంసం పట్ల ఆందోళనకరమని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ఈ ఘర్షణలో అత్యంత ప్రభావితమైన వారికి తక్షణ సహాయక చర్యలు అవసరమని స్పష్టం చేశారు. 55వ హూమన్ రైట్స్ కౌన్సిల్ సమావేశంలో భాగంగా జైశంకర్ వర్చువల్‌గా ప్రసంగించారు. గాజాలో జరిగిన ఘర్షణ పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఆయన..ఉగ్రవాదులు బందీలుగా చేసుకోవడం కూడా సరైంది కాదని తెలిపారు. అంతర్జాతీయ చట్టాలను ఎల్లప్పుడూ గౌరవించాలని సూచించారు. ఇరు వర్గాల మధ్య సత్వర పరిష్కారానికి కృషి చేయాలని నొక్కిచెప్పారు. దీనికి వెంటనే ప్రయత్నాలు ప్రారంభించాలని చెప్పారు. భారత ప్రజాస్వామ్యానికి 2024 ఒక ముఖ్యమైన సంవత్సరం అని తెలిపారు. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో దాదాపు 960 మిలియన్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సన్నద్ధమవుతున్నారన్నారు. ప్రజాస్వామ్య సూత్రాలను నిరంతరం పరీక్షించే ఏకైక దేశం భారత్ మాత్రమేనని కొనియాడారు. భారత్ చొరవతో జీ20లో ఆఫ్రికన్ యూనియన్ శాశ్వత సభ్యత్వం పొందిందని గుర్తు చేశారు.