ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత: కేంద్రం కీలక నిర్ణయం

by samatah |
ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత: కేంద్రం కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) దశ IIIని విధించింది. గాలి మరింత క్షీణించడాన్ని అరికట్టడానికి మొత్తం జాతీయ రాజధాని ప్రాంతం అంతటా గ్రాప్ దశ-IIIకి అనుగుణంగా 8-పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని క్లీన్ ఎయిర్ అండ్ సస్టైనబుల్ మొబిలిటీపై సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సబ్ కమిటీ ఆదేశించింది. బీఎస్ III పెట్రోల్, బీఎస్-IV డీజిల్ లైట్ మోటార్ వెహికల్స్ వాడకంపై కఠినమైన ఆంక్షలు విధించాలని తెలిపింది. తక్షణమే ఈ ప్రణాళిక అమలులోకి తీసుకురావాలని తెలిపింది. గ్రాప్ -III నిబంధనల ప్రకారం..అన్ని స్టోన్ క్రషర్లు, మైనింగ్ సంబంధిక కార్యకలాపాలన్నీ నిలిపివేయబడతాయి. నిర్ధిష్ట ప్రాజెక్టులకు కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ, నిర్మాణం, కూల్చివేత చర్యలు కఠినంగా ఉంటాయి. ఇది ఢిల్లీతో పాటు గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ నగర్ జిల్లాల్లో అమలు చేస్తారు. వాయు కాలుష్యానికి దోహదపడే వాహన ఉద్గారాలను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలో పలు రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Advertisement

Next Story