- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Delimitation: ఈనెల 5న తమిళనాడులో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్, త్రిభాషా విధానంపై డిస్కషన్ !

దిశ, నేషనల్ బ్యూరో: డీలిమిటేషన్ (Delimitation), త్రి భాషా వివాదం (language row) తమిళనాడు (Tamilnadu)ను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ నెల 5వ తేదీన సీఎం స్టాలిన్ (Cm stalin) అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చారు. సమావేశంలో భాగంగా ఈ రెండు అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ మీటింగ్ కి తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIDMK)తో పాటు పలు పార్టీల నాయకులు హాజరుకానున్నారు. చెన్నయ్‌లో జరిగే అఖిలపక్ష సమావేశంలో తమ పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులు పాల్గొంటారని, డీలిమిటేషన్, త్రి భాషా సూత్రంపై పార్టీ వైఖరిని స్పష్టంగా తెలియజేస్తామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి తెలిపారు. అలాగే బీజేపీ మిత్రపక్షమైన పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) కూడా ఈ కీలక సమావేశంలో పాల్గొంటున్నట్టు ప్రకటించింది. మరోవైపు ఈ సమావేశానికి తాము హాజరుకావడం లేదని బీజేపీ స్పష్టం చేసింది.
స్టాలిన్ భయాన్ని వ్యాప్తి చేస్తున్నారు: అన్నామలై
సీఎం స్టాలిన్ పిలుపునిచ్చిన అఖిల పక్ష భేటీని బీజేపీ బహిష్కరిస్తున్నట్టు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై (Annamalai) తెలిపారు. డీలిమిటేష్, త్రి భాషా విధానంపై స్టాలిన్ అసత్యప్రచారాలు చేస్తున్నారని, ప్రజల్లో భయాన్ని వ్యాప్తి చేసే ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. డీలిమిటేషన్ వల్ల తమిళనాడు పార్లమెంటరీ సీట్లు తగ్గుతాయని ఏ ప్రాతిపదికన చెబుతున్నారో ఆయన వివరణ ఇవ్వాలన్నారు. దీనికి గల సరైన కారణాన్ని వెల్లడిస్తే తమ పార్టీ వైఖరిని పున:పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.