DELHI : లోక్‌సభ ఎన్నికల వేళ ఆప్ నేతల సంచలన నిర్ణయం.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా సునీతా కేజ్రీవాల్?

by Shiva |   ( Updated:2024-04-03 10:28:04.0  )
DELHI : లోక్‌సభ ఎన్నికల వేళ ఆప్ నేతల సంచలన నిర్ణయం.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా సునీతా కేజ్రీవాల్?
X

దిశ, వెబ్‌డెస్క్: లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ఈడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ మేరకు ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. మరోవైపు లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన వ్యక్తి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోవడానికి అర్హుడు కాడంటూ విపక్ష బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అయినా.. కేజ్రీవాల్ ఆయన పదవికి ఇంకా రాజీనామా చేయాలేదు. అయితే, దేశ చరిత్రలో అరెస్ట్ అయి వ్యక్తి తమ పదువులకు రాజీనామా చేసిన చరిత్ర ఉంది.

ఇటీవలే జార్ఖండ్ సీఎం హేమంత సోరెన్‌ అరెస్ట్ అయ్యే ముందు సీఎం పదవికి రాజీనామా చేశారు. కానీ కేజ్రీవాల్ మాత్రం రాజీనామా విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పటికీ జైలు నుంచే తమ నాయకుడు రాష్ట్రాన్ని పాలిస్తారంటూ ఆప్ నేతలు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కేజ్రీ తీహార్ జైలులో ఉన్నందున రాజీనామా చేయక తప్పేటట్లు లేదు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఢిల్లీ తరువాత సీఎం ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంలో ఇప్పటికే కొంతమంది బయటకు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించాలంటూ ఆప్ నేతల నుంచి ఒత్తిడి వస్తోంది.

కానీ, ఆమెకు ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేదు. ప్రస్తుతం ఆమె గృహిణిగానే ఉన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తరువాతే ఆమె వెలుగులోకి వచ్చారు. భర్త అరెస్ట్ తరువాత.. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌పై ప్రెస్ మీట్ పెట్టి దుమ్మెత్తిపోశారు. ఈ క్రమంలోనే సునీతా కేజ్రీవాల్ పేరు ఢిల్లీ సీఎంగా ప్రముఖంగా వినిపిస్తోంది. కాగా, సునీతా ఐఆర్ఎస్ ఆఫీసర్‌గా పదవీ విరమణ పొందారు. సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలు అమెకు ఉన్నాయని ఆప్ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Next Story