Delhi Air Pollution: ఢిల్లీలో మోగుతున్న ప్రమాద ఘంటికలు

by Shamantha N |
Delhi Air Pollution: ఢిల్లీలో మోగుతున్న ప్రమాద ఘంటికలు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం(Delhi Air Pollution) పెరిగిపోయింది. అక్కడ ప్రమాద ఘంటికలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం ఐదు గంటలకు ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించిపోయింది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(AQI) 500 పాయింట్లుకు చేరింది. కేవలం 12 గంటల వ్యవధిలోనే 327 నుంచి 447కి ఏక్యూఐ పెరిగి కాలుష్య తీవ్రత రికార్డు స్థాయికి వెళ్లిపోయింది. గాలి కాలుష్యానికి తోడు ఢిల్లీ నగరం అంతటా దట్టమైన పొగ మంచు కమ్మేయడంతో విజిబిలిటీ తగ్గిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

65 రెట్లు ఎక్కువ

ఇక, ఆనంద్ విహార్ వంటి ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 500 కంటే ఎక్కువగా ఏక్యూఐ నమోదైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 500 పాయింట్లకు చేరితే ప్రమాదకర స్థాయి కాలుష్యంగా అధికారులు పరిగణిస్తారు. ఈ గాలి పీల్చితే ప్రజలకు శ్వాసకోశ సంబంధిత సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఏక్యూఐ 500 పాయింట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నిర్దేశించిన పరిమితికి 65 రెట్లు ఎక్కువ కావడం గమనార్హంగా చెప్పొచ్చు. అయితే, శనివారం రాత్రి 9 గంటలకు 327గా ఉన్న ఏక్యూఐ కేవలం 10 గంటల్లో ఆదివారం ఉదయానికల్లా 500 పాయింట్లు దాటడం ఢిల్లీ వాసులను తీవ్ర కలవరపరుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed