- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Road Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

దిశ, వెబ్‌డెస్క్/సూర్యాపేట టౌన్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఇద్దరు దుర్మరణం పాలైన విషాద ఘటన సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల మూలమలుపు వద్ద గుంటూరు నుంచి హైద్రాబాద్ వెళ్తున్న యోలో ట్రావెల్స్ బస్సు స్పీడ్ బ్రేకర్స్ ఉండటంతో అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో వెనుక నుంచి అతివేగంతో వచ్చి జింగ్ ట్రావెల్స్ బస్సు, యోలో ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో జింగ్ ట్రావెల్స్ బస్సు ముందు భాగంలో కూర్చున్న క్లినర్ సాయి అద్దంలోంచి ఎగిరిపడి బస్సు టైర్ల కింద పడి ప్రాణాలో కోల్పోయాడు.
అదేవిధంగా యోలో ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న పాషా అనే ప్రయాణికుడు ప్రమాద కుదుపునకు గురై గుండెపోటుతో మరణించారు. బస్సులో ఉన్న మరో ఐదుగురు ప్రయాణికులకు కూడా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న సూర్యాపేట టౌన్ పోలీసులు మృతులు, క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలుగకుండా రోడ్డు అడ్డంగా బస్సును తొలగించారు. యోలో బస్సు నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.