Delhi: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో పరిణామం.. మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

by Shiva |   ( Updated:2024-05-21 10:32:27.0  )
Delhi: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో పరిణామం.. మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో పరిణామం చోటుచేసుకుంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ కీలక నేత మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని మే 31 వరకు పొడిగిస్తూ మంగళవారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఉత్వర్వులు జారీ చేసింది. అయితే, సిసోడియా ఈ కేసులో ఫిబ్రవరి 2023 నుంచి జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. కాగా, మనీలాండరింగ్ కేసులో ఈడీ, సీబీఐ దాఖలు చేసిన మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు తన తీర్పును వెలువరించే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం ఇవాళ సాయంత్రం 5 గంటలకు జస్టిస్ స్వర్ణకాంత శర్మ రెండు బెయిల్ పిటిషన్లపై తుది ఉత్తర్వులను వెల్లడించే అవకాశం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వాదనలు విన్న తర్వాత ఢిల్లీ హైకోర్టు మే 14న మనీష్ సిసోడియా పిటిషన్‌పై తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.

Read More..

స్కూల్ పరిసరాల్లో కూల్ డ్రింక్స్ అమ్మకాలు.. WHO కీలక మార్గదర్శకాలు విడుదల

Advertisement

Next Story

Most Viewed