- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘శవాన్ని సగానికి కోసి ఇవ్వు’.. తండ్రి అంత్యక్రియల కోసం అన్నదమ్ముల డిమాండ్

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. తండ్రి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించే విషయం పై ఇద్దరు అన్నదమ్ములు(brothers) తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఓ సోదరుడు తండ్రి భౌతిక కాయాన్ని రెండు ముక్కలు చేసి అంత్యక్రియలు చేయాలని డిమాండ్ చేశాడు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్(Madyapradesh)లోని తికమ్‌గఢ్ జిల్లాలో తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. లిధోరతాల్ గ్రామంలో ధ్యానిసింగ్ ఘోష్(84) అనే వృద్ధుడు మృతి చెందాడు. ఈ క్రమంలో తండ్రి అంత్యక్రియల నిర్వహణలో కొడుకులు కిషన్, దేశ్‌రాజ్‌ల మధ్య వివాదం తలెత్తింది. అంతిమసంస్కారాలను నేను నిర్వహిస్తానంటే.. నేను నిర్వహిస్తానంటూ ఇద్దరూ అన్నదమ్ములు గొడవకు దిగారు.
దీంతో తన తండ్రి మృతదేహాన్ని సగానికి కట్ చేసి తనకు ఇవ్వాలని పెద్ద కుమారుడు కోరడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అక్కడి పరిస్థితిని చూసిన పలువురు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు(Police) అక్కడికి చేరుకొని ఆ అన్నదమ్ములకు నచ్చజెప్పి.. పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలను పూర్తి చేసినట్లు జతారా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అరవింద్ సింగ్ డాంగి తెలిపారు.