CPI(M) Leader Sitaram Yechury: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమం

by Shamantha N |
CPI(M) Leader Sitaram Yechury: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమం
X

దిశ, నేషనల్ బ్యూరో: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(Sitaram Yechury) పరిస్థితి విషమంగా ఉంది. ఢిల్లీ ఎయిమ్స్(AIIMS Delhi)లో 72 ఏళ్ల ఏచూరికి వెంటిలేటర్ పైన ట్రీట్మెంట్ జరుగుతోంది. ఆయనకు తీవ్రమైన శ్వాసకోశ ఇన్ ఫెక్షన్ జరిగిందని సీపీఎం(CPI(M)) పార్టీ ప్రకటించింది. ‘‘సీతారాం ఏచూరి తీవ్రమైన శ్వాస‌కోస ఇన్‌ఫెక్ష‌న్ తో బాధపడుతున్నారు. ప్ర‌స్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. డాక్టర్ల బృందం ఏచూరిని నిశితంగా, నిరంతరం పర్యవేక్షిస్తోంది” అని సోషల్ మీడియా ఎక్స్ లో సీపీఎం పార్టీ పోస్టు పెట్టింది.

ఆగస్టు 19 నుంచి ఎయిమ్స్ లో ట్రీట్మెంట్

ఆగ‌స్టు 19వ తేదీన ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌లో చేరారు. న్యుమోనియా లాంటి ఛాతి ఇన్‌ఫెక్ష‌న్‌తో ఏచూరి బాధ‌ప‌డుతున్నట్లు తేలింది. అప్పట్నుంచి ఆయన అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కాగా.. ఆయన పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో వైద్యుల నిర్ణయం మేరకు వెంటిలేటర్‌ పైన చికిత్స పొందుతున్నారు. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి నిలకడగా మారిందడని.. చికిత్సకు ఆయన సానుకూలంగా స్పందిస్తున్నట్లు పార్టీ పేర్కొంది. దీంతో, ఆయన కోలుకుంటున్నారని అందరూ భావించారు. కాగా.. మంగళవారం ఆయన పరిస్థితి మరింత దిగజారిందని పార్టీ ప్రకటించింది. ఏచూరి ఆరోగ్య పరిస్థితిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. వామపక్ష ఉద్యమాలకు ఏచూరి ఒక ఐకాన్.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని ప్రకటించారు. ఎన్నో సమస్యలపై పోరాడిన ఆయన.. ఇప్పుడు తన శరీరంతోనే పోరాడుతున్నాడని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed