- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Costly Fruits: ఈ పండ్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి.. ధర తెలిస్తే షాక్ అవుతారు!

దిశ, వెబ్ డెస్క్: ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యూలర్‌గా తాజా పండ్లు, కూరగాయలు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. వీటిల్లో ఉండే ఫైబర్, ప్రొటీన్, విటమిన్లు, మినరల్స్ శరీరానికి కావాల్సిన పోషకాలను సమృద్ధిగా అందించి అనారోగ్య సమస్యల నుంచి కాపాడతాయి. ఇక మనకు మార్కెట్లో ఎన్నో రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. ఒక్కో రకం పండుకు ఒక్కో ధర ఉంటుంది. సీజనల్ ఫ్రూట్స్‌కి అయితే ధర కాస్తా ఎక్కువగానే ఉంటుంది. అది కూడా వందల్లోనే ఉంటుంది. అయితే, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనా పండ్లుగా ప్రజాదరణ పొందిన పండ్ల ధరలు తెలిస్తే షాక్ అవుతారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
* హక్కైడో పుచ్చకాయ (Hokkaido watermelon): ఇది జపాన్‌లో హక్కైడోలోని ఒక ప్రత్యేక ప్రాంతంలో పెరుగుతుంది. దీనిని 'యుబారి కింగ్ పుచ్చకాయ' (Yubari King Watermelon) అని కూడా పిలుస్తారు. దీని ధర దాదాపు 25,000 డాలర్లు (దాదాపు 22 లక్షల రూపాయలు) ఉంటుంది. జపాన్‌లో ధనవంతులు దీనిని బహుమతిగా ఇస్తారు.
* డెన్సుకే పుచ్చకాయ (Densuke watermelon): ఇది కూడా జపాన్‌లోని హక్కైడో ప్రాంతంలో మాత్రమే పెరుగుతుంది. నల్ల తొక్కతో కూడిన ఈ ప్రత్యేక రకం పుచ్చకాయ దాదాపు 6,000 డాలర్లు ఉంటుంది.
* రూబీ రోమన్ ద్రాక్ష(Ruby Roman grapes): జపాన్‌లో లభించే ఈ ద్రాక్ష పండ్లు ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ద్రాక్షలలో ఇది ఒకటి. ఇది సాధారణ మార్కెట్లో అందుబాటులో లేదు. కానీ వేలంలో అమ్ముతారు. ఒక బ్యాగ్ ధర దాదాపు 8,400 డాలర్ల వరకు ఉంటుంది.
* సిట్రస్ డెకోపాన్ (Citrus Decopan): ఈ ప్రత్యేకమైన నారింజ పండు జపాన్‌లో లభ్యమవుతుంది. దీని ధర 80 నుండి 100 డాలర్లకు అమ్ముతారు. దీనికి విత్తనాలు ఉండవు.
* సెకై ఇచి ఆపిల్ (Sekai Ichi Apple): జపాన్‌లో లభించే ఈ ఆపిల్‌కు ప్రపంచంలోనే అత్యుత్తమైనదిగా పేరుంది. ఒక ఆపిల్ ధర 21 డాలర్లు ఉంటుంది.
* ఫుయు పెర్సిమోన్ (Fuyu Persimmon): ఇది జపాన్‌లో బాగా ప్రాచుర్యం పొందిన పండు. దీని ధర 10 నుంచి 20 డాలర్ల మధ్య ఉంటుంది.
* టైయో నో టమాగో మామిడి (Taiyo no Tamago Mango): జపాన్‌కు చెందిన ఈ ప్రత్యేకమైన మామిడి పండు.. పండిన తర్వాత ఎరుపు-నారింజ రంగులోకి మారుతుంది. దీని ఆకారం గుడ్డు వలే ఉంటుంది. అందుకే దీనిని 'సూర్యుడి గుడ్డు' అని పిలుస్తారు. దీని ధర 100 నుంచి 200 డాలర్ల వరకు ఉంటుంది.
* బిజెమ్ దురియన్ (Bizem Durian): థాయ్‌లాండ్‌లో లభించే ఈ పండు ఆగ్నేయాసియాలో బాగా ప్రాచుర్యం పొందింది. దీని ధర 2,500 డాలర్ల వరకు ఉంటుంది.
* హెలిగాన్ గార్డెన్ పైనాపిల్ (Heligan Garden Pineapple): ఇంగ్లాండ్‌లోని 'లాస్ట్ గార్డెన్ ఆఫ్ హెలిగాన్'లో ఈ పైనాపిల్స్‌ను పండిస్తారు. వీటి ధర 1,500 డాలర్ల వరకు ఉంటుంది.
* హమీ మెలోన్ (Hammy Melon): చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో దీనిని పండిస్తారు. ఈ ప్రత్యేక రకం పుచ్చకాయ ధర 200 నుంచి 300 డాలర్లు ఉంటుంది.
Read More ....
వేసవి వచ్చేసింది.. మీ రోజూ వారి ఆహారంలో కచ్చితంగా పెసరపప్పును చేర్చుకోవాల్సిందే.. ఎందుకంటే?