- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bharat Jodo Yatra: సెప్టెంబర్ 7 నుంచి కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర
దిశ, వెబ్‌డెస్క్: Congress Party to Launch Bharat Jodo Yatra from September 7| కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ జోడో యాత్ర అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున ప్రారంభించాలని ఉదయ్‌పూర్ చింతన్ శివిర్‌లో నిర్ణయించారు. కానీ, దీన్ని సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభిస్తున్నట్లు, 80 ఏళ్ల క్రితం ఇదే రోజున మహాత్మా గాంధీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అధికారిక ప్రకటనలో తెలిపారు. ఐదేళ్ల తర్వాత ఈ ఉద్యమం భారతదేశానికి స్వాతంత్య్రానికి దారితీసిందని ఆయన అన్నారు.
రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు ఈ యాత్రలో పాల్గొంటారని 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ 3,500 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుందని, దాదాపు 150 రోజుల్లో పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. ట్విట్టర్‌లో ఆర్ఎస్ఎస్‌పై తీవ్ర దాడి చేశారు. మహాత్మా గాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమంలో RSS పాత్ర ఏంటి అని అడిగారు. క్విట్ ఇండియా ఉద్యమంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇందులో పాల్గొనలేదు, గాంధీ, నెహ్రూ, పటేల్, ఆజాద్, ప్రసాద్, పంత్ అనేక మంది జైలు పాలయ్యారు అని ఆయన పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఇరకాటంలో మహారాష్ట్ర బీజేపీ.. విమర్శల పాలవుతున్న ఫడ్నవీస్..!!