DK శివకుమార్ పుట్టినరోజున కొలువుదీరనున్న కాంగ్రెస్ సర్కార్

by GSrikanth |   ( Updated:2023-05-13 10:49:54.0  )
DK శివకుమార్ పుట్టినరోజున కొలువుదీరనున్న కాంగ్రెస్ సర్కార్
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కేవలం 113 సీట్లు కావాల్సి ఉండగా.. ఏకంగా 130కి పైగా స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు స్టార్ట్ చేశారు. కర్ణాటకలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పుట్టినరోజు నాడు కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరనుంది. కంఠీరవ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాణస్వీకార సభ ఏర్పా్ట్లు చేస్తున్నారు. ఎల్లుండి కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

అదేరోజు (మే 15న) పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ పుట్టినరోజు కావడం గమనార్హం. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్‌కు సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోయే గిఫ్ట్ ఏమిటనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేసులో డీకేతో పాటు మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ లీడర్ సిద్ధరామయ్య బరిలో ఉన్నారు. కాగా, గతంలో తన బర్త్ డే రోజున సోనియా గాంధీకి భారీ గిఫ్ట్ ఇస్తానని డీకే బహిరంగ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

Read More... ఇది బలవంతులపై బలహీనుల విజయం.. రాహుల్ గాంధీ

Advertisement

Next Story