- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kangana Ranaut: కంగనాకు కాంగ్రెస్ అభినందనలు.. షాకవుతున్న నెటిజన్లు

దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్ క్వీన్, బీజేపీ ఎంపీ (BJP MP) కంగనా రనౌత్ (Kangana Ranaut) కేఫ్ పై కాంగ్రెస్ స్పందించింది. ఆమెకు అభినందనలు తెలిపింది. ‘‘మనాలిలో పూర్తిగా వెజిటేరియన్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేయడం అభినందనీయం. టూరిస్టులకు హిమాచల్‌లోని ప్రత్యేక వెజ్ వంటకాలను అందిస్తారని ఆశిస్తున్నాం’’ అంటూ కేరళ కాంగ్రెస్ యూనిట్ సోషల్ మీడియా‘ఎక్స్’ వేదికగా పోస్టు చేసింది. అంతేకాకుండా, కంగనాకు సంబంధించిన వీడియోను ట్యాగ్ చేసింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. అయితే.. బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ పార్టీ అభినందనలు తెలియజేయడంపై సందేహాలు లేవనెత్తుతున్నారు. ‘‘కాంగ్రెస్ అకౌంట్ హ్యాక్ అయ్యిందా..?’’ అని ఒకరు.. ‘‘ఈ అకౌంట్‌ను స్కూల్ స్టూడెంట్లు నడుపుతున్నారేమో అనుకుంటా’’.. అని మరొక నెటిజన్ వ్యంగాస్త్రాలు గుప్పించారు. అంతేకాకుండా, ఈ విషయంలో పార్టీ మద్దతుదారుల నుంచి కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది.
వ్యాపారరంగంలోకి కంగనా..
ఇకపోతే, కంగనా ఇటీవలే వ్యాపారరంగంలోకి అడుగుపెట్టారు. ‘ది మౌంటైన్ స్టోరీ’ పేరుతో హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 14న కేఫ్ ప్రారంభం కానుంది. చిన్ననాటి తన కల ఇప్పుడు నెరవేరిందని.. హిమాలయాల్లో చిన్న రెస్టారెంట్ ఏర్పాటు చేశామని కంగనా సోషల్ మీడియాలో వెల్లడించారు. సంప్రదాయ హిమాచల్ ఫుడ్‌ను మోడ్రన్ అభిరుచులకు అనుగుణంగా అందించడమే లక్ష్యంగా కేఫ్ ను ఏర్పాటు చేశామన్నారు. అయితే, ఆ కేఫ్ పైనే కేరళ కాంగ్రెస్ యూనిట్ స్పందించడం గమనార్హం.