లోక్ సభ ఎన్నికల్లో పోటీ.. కమల్‌హాసన్ క్లారిటీ

by Sathputhe Rajesh |
లోక్ సభ ఎన్నికల్లో పోటీ.. కమల్‌హాసన్ క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: నెక్ట్స్ ఇయర్ జరగనున్న ఎంపీ ఎలక్షన్స్‌లో కోయంబత్తూరు నుంచి పోటీ చేసేందుకు మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ రెడీ అయినట్లు తమిళనాట చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఇదే అంశంపై తాజాగా కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు. కోయంబత్తూరు అవినాశి రోడ్డులో పార్టీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోటీ చేసే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. త్వరలో క్లారిటీ ఇస్తానన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం విషయమై శనివారం డిసిషన్ తీసుకుంటామన్నారు.

Advertisement

Next Story