- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు!
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు అయ్యింది. బెయిల్ 48 గంటల పాటు నిలిపివేయాలన్న ఈడీ వాదనను తోసిపుచ్చి, ఒక లక్ష పూచికత్తుపై రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యూడిషియల్ కస్టడీపై తీహార్ జైలులో ఉన్నారు. తాత్కాలిక బెయిల్ పై వెళ్లి ఎన్నికలు అయ్యాక తిరిగి వచ్చిన ఆయన.. మరోసారి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని ధరఖాస్తు చేసుకున్నారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు వెకెషన్ జడ్జి నియామ్ బిందు.. గురువారం ఉదయం తీర్పు రిజర్వు చేశారు.
మళ్లీ గురువారం సాయంత్రం బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఈడీ కలగజేసుకొని బెయిల్ బాండ్ పై సంతకం చేయడాన్ని మరో 48 గంటల పాటు స్టే విధించాలని, తద్వారా ఈ తీర్పును పై కోర్టులో సవాల్ చేసేందుకు వీలు కలుగుతుందని విజ్ఞప్తి చేసింది. ఈడీ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన న్యాయస్థానం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసులో ఆప్ అధినేత కేజ్రీవాల్ ను మార్చి21న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి తాత్కాలికంగా మూడు వారాల పాటు బెయిల్ మంజూరు చేయగా.. ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ కేజ్రీవాల్ తీహార్ జైలుకు తిరిగి వెళ్లారు.