- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యోగి పై పోటీకి చంద్రశేఖర్ ఆజాద్.. గోరఖ్ పూర్ స్థానం నుంచి..
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. గోరఖ్ పూర్ లో బరిలో దిగి యోగిని ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని ఆయన ప్రకటించారు. ఇక గోరఖ్ పూర్ స్థానం బీజేపీ కంచుకోట అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 1989 నుంచి పోటీ చేసిన ప్రతిసారీ బీజేపీయే గెలుపొందింది. కేవలం ఒక్కసారి మాత్రమే పరాజయం పాలైంది. 'యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడం నాకు ముఖ్యం కాకపోవచ్చు. కానీ, యోగీ ఆదిత్యనాథ్ ను అసెంబ్లీలో అడుగు పెట్ట నీయకుండా చేయడానికి నేను ప్రాధాన్యత ఇస్తాను.
యోగీ ఎక్కడ పోటీ చేస్తే, నేను అక్కడి నుంచి బరిలోకి దిగుతా' అని గతంలోనే ప్రకటించారు. గతంలో యూపీ పోలీసులు ఆయనను అల్లర్లకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ అరెస్ట్ చేశారు. దాదాపు 16 నెలల పాటు ఆయన జైలు శిక్ష అనుభవించారు. ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి కాగా, యోగీ గతంలో గోరఖ్‌పూర్ నుంచి 5 సార్లు ఎంపీగా గెలుపొందారు. ఏడు విడుతలుగా జరిగే గోరఖ్‌పూర్ స్థానానికి ఆరో విడుతలో ఎన్నికలు జరగనున్నాయి. రెండు రోజుల క్రితం ఏఎస్పీ 33 మంది అభ్యర్థులతో మొదటి విడత జాబితా విడుదల చేసింది.