Chandigarh: చండీగఢ్ మేయర్‌గా బీజేపీ అభ్యర్థి విజయం.. ఆప్, కాంగ్రెస్‌లకు భారీ షాక్

by vinod kumar |
Chandigarh: చండీగఢ్ మేయర్‌గా బీజేపీ అభ్యర్థి విజయం.. ఆప్, కాంగ్రెస్‌లకు భారీ షాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ (Chandigarh Muncipal carporation) కొత్త మేయర్‌గా బీజేపీ అభ్యర్థి హర్‌ప్రీత్ బబ్లా (Harpreet Kaur Babla) నియామకమయ్యారు. ఈ పదవికి గురువారం ఓటింగ్ జరగగా ఆమ్ ఆద్మీ పార్టీ (Aap), కాంగ్రెస్ (congress) ఉమ్మడి అభ్యర్థి ప్రేమ్ లత (Prem lata)పై ఆమె విజయం సాధించారు. హర్ ప్రీత్‌కు 19 ఓట్లు రాగా, ప్రేమ్ లతకు 17 ఓట్లు వచ్చాయి. దీంతో హర్‌ప్రీత్ బబ్లా గెలుపొందినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కార్పొరేషన్‌లో మొత్తం 36 ఓట్లు ఉండగా అందులో 35 మంది కౌన్సిలర్లు, అలాగే ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఛండీగడ్ పార్లమెంటు సభ్యుడు ఉన్నారు. మెజారిటీకి 19 ఓట్లు అవసరం ఉండగా బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. అయితే తగినంత మెజారిటీ లేకపోయినప్పటికీ బీజేపీ విజయం సాధించడం గమనార్హం. ప్రస్తుతం కౌన్సిల్‌లో ఆప్‌కు 13 మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్ 6, బీజేపీకి 16, చండీగఢ్ ఎంపీ (కాంగ్రెస్)కి 1 ఓటు ఉన్నాయి. అయితే ఆప్, కాంగ్రెస్‌కి చెందిన సభ్యులు క్రాస్ ఓటింగ్ చేయడంతో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. దీంతో ఆప్, కాంగ్రెస్ పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది. కాగా, సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లను కూడా ప్రకటించారు. మరోవైపు డిప్యూటీ మేయర్‌గా కాంగ్రెస్ అభ్యర్థి జస్బీర్ సింగ్ (Jaspeer singh) బంటీ ఎన్నికయ్యారు. దీంతో పాటు డిప్యూటీ మేయర్‌గా కాంగ్రెస్‌కు చెందిన తరుణ మెహతా గెలుపొందారు.

Next Story

Most Viewed