extradition: భారత్ కు పంపిస్తే చిత్రహింసలు పెడతారు- ముంబై ఉగ్రదాడి కేసులో దోషి సంచలన వ్యాఖ్యలు

by Shamantha N |
extradition: భారత్ కు పంపిస్తే చిత్రహింసలు పెడతారు- ముంబై ఉగ్రదాడి కేసులో దోషి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబై ఉగ్రదాడి ఘటనలో దోషిగా తేరిన తహవూర్ రాణా(Tahawwur Rana).. భారత్ పై నిందలు మోపుతూ అమెరికా కోర్టుని ఆశ్రయించాడు. తనను భారత్ కు అప్పగించవద్దని కోరాడు. అప్పగింతను(Extradition) వెంటనే నిలిపివేయాలని రాణా యూఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. భారత్‌కు పంపిస్తే అక్కడ చిత్రహింసలకు గురిచేస్తారని ఆరోపించాడు. ఈ మేరకు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. అప్పగింతపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకారం తెలిపడంతో రాణా కోర్టుని ఆశ్రయించాడు.

ముంబై దాడుల్లో కీలక సూత్రధారి

తహవూర్‌ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. కాగా.. 26/11 ముంబై దాడుల్లో అతడు కీలక సూత్రధారి. ఉగ్ర కుట్రకు మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న డేవిడ్‌ కోల్మన్‌ హెడ్లీ.. ముంబైలో రెక్కీ నిర్వహించాడు. అతడికి రాణా సహకరించినట్లు తెలుస్తోంది. ముంబై ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూప్రింట్‌ తయారీలో రాణా హస్తం ఉంది. రాణా, హెడ్లీపై ఉగ్ర దాడులు, కుట్ర కేసులు నమోదు చేశారు. 26/11 దాడులు జరిగిన ఏడాది తర్వాత షికాగో ఎఫ్‌బీఐ అధికారులు రాణాను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం, రాణా లాస్‌ ఏంజెలెస్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని తమకు అప్పగించాలంటూ చాలాకాలంగా భారత్‌ పోరాడుతోంది. దీన్ని సవాల్‌ చేస్తూ తహవూర్‌ రాణా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా.. ఆయా న్యాయస్థానాలు అతడి అభ్యర్థనను తిరస్కరించాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూఎస్‌ కోర్టు ఆఫ్‌ అప్పీల్‌లోనూ అతడికి నిరాశే మిగిలింది. దీంతో అతడు గతేడాది నవంబరు 13న అమెరికా సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశాడు. దాన్ని కొట్టివేయాలని అమెరికా ప్రభుత్వం కోర్టుకు 20 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఆ అఫిడవిట్ ని పరిశీలించిన సుప్రీంకోర్టు రాణా అభ్యర్థనను తిరస్కరించింది. దాంతో అతడిని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. ఇటీవల రాణా అప్పగింతపై ట్రంప్ కూడా ప్రకటన చేశారు.



Next Story

Most Viewed