- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బంపరాఫర్.. ఆ గ్రామంలో స్థిరపడితే రూ.50 లక్షలు మీవే!
దిశ, వెబ్‌డెస్క్: గ్రామాల్లో సరైన ఉపాధి అవకాశాలు లేక ప్రపంచంలో చాలామంది పట్నం బాట పడుతున్నారు. పల్లెటూర్లలో ఉండేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో నిండుగా ఉండే గ్రామాలు జనాలు లేక ఖాలీగా మారుతున్నాయి. పట్టణాల్లో కాయకష్టం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటూ ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. అయితే గ్రామంలోనే ఉంటూ మీరు ఏ పని చేయకుండా దాదాపు రూ.50 లక్షలు సంపాదించవచ్చట.
వివరాల్లోకి వెళితే.. స్విట్జర్లాండ్‌లో ఆల్బినెన్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో చుట్టూ మంచుకొండలు స్వచ్ఛమైన గాలి కలుషితం కాని నీరు.. సముద్ర తీరాన పచ్చటి వాతావరణం కలిగి ఉంటుంది. కానీ, అక్కడ జనాలు మెరుగైన జీవితం కోసం పట్నాలకు వెళ్లడంతో ఊరంతా ఖాళీ అయింది. ప్రస్తుతం ఆ ప్రదేశంలో జనాభా 243కు చేరుకుంది. ఇలాగే వదిలేస్తే చుట్టు పక్కల గ్రామాలు మొత్తం ఖాళీ అవుతాయని భావించి ప్రభుత్వం ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఆల్బినెన్‌కు వచ్చి స్థిరపడే కుటుంబాలకు దాదాపు రూ.50 లక్షలు ఇస్తామని స్విట్జర్లాండ్ ప్రభుత్వం తెలిపింది.