Space Economy : ‘అంతరిక్ష’ రంగానికి రూ.1,000 కోట్ల వెంచర్ ఫండ్‌

by Hajipasha |   ( Updated:2024-07-23 17:57:18.0  )
Space Economy : ‘అంతరిక్ష’ రంగానికి రూ.1,000 కోట్ల వెంచర్ ఫండ్‌
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశ అంతరిక్ష రంగానికి కేంద్ర బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యత లభించింది. అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను వచ్చే పదేళ్లలో ఐదురెట్లు పెంచే లక్ష్యంతో రూ.1000 కోట్ల వెంచర్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని ద్వారా ప్రభుత్వ గుర్తింపు పొందిన 180కిపైగా స్పేస్ టెక్నాలజీ స్టార్టప్స్‌‌లో పెట్టుబడి పెట్టే వెంచర్ క్యాపిటలిస్టులకు ప్రోత్సాహం లభించనుంది. పెట్టుబడులకు నోచుకోక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రైవేటురంగ స్పేస్ కంపెనీలకు వెంచర్ ఫండ్ నుంచి సహకారం అందించనున్నారు. దీనివల్ల మన దేశ అంతరిక్ష సేవల రంగం వేగంగా విస్తరిస్తుందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం మన దేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ విలువ దాదాపు రూ.68వేల కోట్లు. ఇది ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ విలువలో కేవలం 2 నుంచి 3 శాతం మాత్రమే. 2033కల్లా భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను రూ.3.52 లక్షల కోట్లకు చేర్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ పురోగతిలో ప్రైవేటు రంగ స్పేస్ స్టార్టప్స్ కీలక భూమిక పోషించనున్నాయని అంటున్నారు. శాటిలైట్ల తయారీ, లాంచ్ వెహికల్స్ తయారీ, శాటిలైట్ సేవలు, గ్రౌండ్ సిస్టమ్స్ తయారీ వంటి కార్యకలాపాల ద్వారా ఆ కంపెనీలు ఆదాయాన్ని గడించనున్నాయి.

Advertisement

Next Story