- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లోక్‌సభలో కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావు.. యూపీలో బోణీ చేయదు: ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం పోలింగ్ జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ బోణీ కూడా చేయదని.. ఒక్క సీటు వచ్చే పరిస్థితి లేదని ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేయడానికి ముందు మోడీ దశాశ్వమేధ ఘాట దగ్గర గంగానదిలో స్నానం చేసి గంగాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతర నమో ఘాట్‌ను సందర్శించి బాబా కాల భైరవ ఆలయానికి వెళ్లి పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ జాతీయ చానల్ ప్రతినిధితో మాట్లాడుతూ.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవదని.. కనీసం బోణీ కూడా కొట్టలేదని ప్రధానీ ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభలో కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా దాటవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన గెలుపు మీద తనకే నమ్మకం లేక రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి పారిపోయి మళ్లీ రాయబరేలీకి వచ్చాండంటూ కామెంట్ చేశారు. రానున్న ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.