Bomb threat: 2024లో ఎయిర్‌లైన్స్‌కు 728 బాంబు బెదిరింపులు.. అత్యధికంగా ఆ సంస్థకే !

by vinod kumar |
Bomb threat: 2024లో ఎయిర్‌లైన్స్‌కు 728 బాంబు బెదిరింపులు.. అత్యధికంగా ఆ సంస్థకే !
X

దిశ, నేషనల్ బ్యూరో: 2024లో దేశ వ్యాప్తంగా ఎయిర్‌లైన్స్‌ (Airlines)కు మొత్తం 728 బూటకపు బాంబు బెదిరింపులు వచ్చాయని, అందుకు సంబంధించి 13 మందిని అరెస్టు చేశామని కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంటుకు తెలిపింది. ఎంపీ పరిమళ్ నథానీ (Parimal nathanee) అడిగిన ప్రశ్నకు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ (Murlidhar Mohol) లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. గతేడాది 728 వార్నింగ్ కాల్స్ రాగా అత్యధికంగా ఇండిగో (Indigo) ఎయిర్ లైన్స్‌కు 216 కాల్స్ వచ్చాయి. ఆ తర్వాత ఎయిర్ ఇండియా (Air india)179, మాజీ ఎయిర్‌లైన్ విస్తారా 153, అకాసా ఎయిర్72, స్పైస్‌జెట్ 35, అలయన్స్ ఎయిర్ 26, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 19, స్టార్ ఎయిర్ కు 5 బెదిరింపులు వచ్చాయి. అయితే ఇవన్నీ బూటకమేనని విచారణ వెల్లడైనట్టు పేర్కొన్నారు.

అలాగే విదేశీ విమానయాన సంస్థలు కూడా బూటకపు కాల్‌లను అందుకున్నాయని, అయితే అది తక్కువగానే ఉన్నాయని తెలిపారు. దుబాయ్ క్యారియర్ ఎమిరేట్స్‌కు ఐదు కాల్స్ అందగా, ఎయిర్ అరేబియాకు మూడు కాల్స్ వచ్చాయని తెలిపారు. ఎయిర్ కెనడా, ఏరోఫ్లాట్, ఎతిహాద్, కాథే పసిఫిక్, నోక్ ఎయిర్, థాయ్ లయన్ ఎయిర్‌లు ఒక్కొక్క వార్నింగ్ కాల్ అందుకున్నట్టు వెల్లడించారు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అటువంటి బెదిరింపులను నిర్వహించడానికి బలమైన ప్రోటోకాల్‌లను తప్పనిసరి చేసిందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ప్రణాళికలు అమల్లో ఉన్నాయని తెలిపారు.

Next Story

Most Viewed