ఢిల్లీ ఎయిమ్స్ నుంచి అద్వానీ డిశ్చార్జి

by Prasad Jukanti |
ఢిల్లీ ఎయిమ్స్ నుంచి అద్వానీ డిశ్చార్జి
X

దిశ, డైనమిక్ బ్యూరో: అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత ఎల్.కే అద్వానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 96 ఏళ్ల అద్వానీని కుటుంబ సభ్యులు బుధవారం ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ యూరాలజీ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఆయనకు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో డిశ్చార్జి చేశారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశారు. కాగా అద్వానీ ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలతో ఆయన అభిమానులు, బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాయి. ఆయన త్వరగా కోలుకోవాలని పలవురు ప్రార్థనలు చేశారు.

Next Story