బీజేపీ- జేడీఎస్ మధ్య ఘర్షణ.. రసవత్తరంగా కన్నడ రాజకీయాలు

by Shamantha N |   ( Updated:2024-03-25 18:04:50.0  )
బీజేపీ- జేడీఎస్ మధ్య ఘర్షణ.. రసవత్తరంగా కన్నడ రాజకీయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో రాజకీయాలు మారాయి. బీజేపీ- జేడీఎస్ పొత్తు కుదిరింది. ఇటీవలే సీట్ల పంపకాల చర్చలు పూర్తయ్యాయి. కాకపోతే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా కన్పిస్తోంది. తూముకూరులో భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ సెక్యూలర్ మద్దతుదారుల మధ్య గొడవ జరిగింది.

కూటమి అభ్యర్థి సోమన్నకు ప్రచారం చేసేందుకు ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో గొడవ జరిగింది. ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. జేడీఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప.. బీజేపీ నేత కొండజ్జి విశ్వనాథ్‌కి వేలు చూపించడంతో గొడవ మొదలైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటమికి కొండజ్జీయే కారణమని కృష్ణప్ప ఆరోపించారు. జేడీఎస్ నుంచి బీజేపీలో చేరిన విశ్వనాథ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాగా.. సోమన్న గురించి విశ్వనాథ్ మాట్లాడేందుకు యత్నించగా కృష్ణప్ప అడ్డుకున్నారు. దీంతో గొడవ జరిగింది.

తర్వాత ఇరువర్గాల గొడవ పరిష్కరం అయ్యింది. పార్టీ కార్యకర్తల మధ్య ఇంకా స్నేహపూర్వక సంబంధాలు మాత్రం ఏర్పడలేదు. ఇకపోతే జేడీఎస్ కు హసన్, మాండ్య, కోలార్ మూడు లోక్ సభ స్థానాలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మరోవైపు మాజీ ప్రధాని, జేడీఎస్ అగ్రనేత దేవేగౌడ అల్లుడు డాక్టర్ మంజునాథ్ బీజేపీ టికెట్ పై పోటీ చేయనున్నారు. బెంగళూరు రూరల్ నుంచి కన్నడ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ పై పోటీ చేయనున్నారు. జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామి చెన్నైలో శస్త్రచికిత్స చేయించుకుని ఆదివారం బెంగళూరుకు తిరిగి వచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై కుమార స్వామి ఇంకా ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఓల్డ్ మైసూరులో జేడీఎస్ కు వొక్కలిగ మద్దతు ఉంది. దాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తోంది బీజేపీ.

Advertisement

Next Story

Most Viewed