ప్రధాని మోడీపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు.. BJP కీలక నిర్ణయం

by Satheesh |   ( Updated:2023-04-28 14:09:34.0  )
ప్రధాని మోడీపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు.. BJP కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ నేతృత్వంలోని బీజేపీ బృందం ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన భూపేందర్ యాదవ్.. ప్రధాని మోడీని విషసర్పంతో పోల్చుతూ ఖర్గే వ్యాఖ్యలు చేయడం నోరుజాడం కాదని.. ఇది కాంగ్రెస్ ద్వేషపూరిత రాజకీయాల్లో భాగమని అన్నారు. అందువల్ల ఖర్గేను కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేదించాలని కోరినట్లు చెప్పారు. మోడీపై వ్యక్తిగత దాడులకు దిగిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు.

బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. ఖర్గేకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అలవాటే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అల్లర్లు చెలరేగుతాయంటూ కర్ణాటకలో కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతపై బీజేపీ ఫిర్యాదు చేయడంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీగా కేసుల రాజకీయం హాట్ టాపిక్ అవుతోంది.

Also Read..

రాత్రి సమయంలో పెరుగు తింటే ప్రమాదమా..? అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..

భారత రెజ్లర్ల పోరాటంపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story